ఈ మధ్య కాలంలో థియేటర్లో రిలీజయ్యే సినిమాలకుండే సందడి కంటే, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలకే ఎక్కువ సందడి ఉంటుంది. ఓటీటీ సంస్థలు కూడ ప్రతీవారం ఒక కొత్త సినిమాలతో ఓటీటీ ప్రియులను ఆకర్షిస్తున్నారు. గతంలో ఒక సినిమా రిలీజైతే రెండు, మూడు నెలల వరకు టీవలో వచ్చేది కాదు. ఇక ఇప్పుడు రిలీజైన రెండు, మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. గత వారంలాగే ఈ వారం కూడా థియేటర్లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలు రిలీజవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో రీసెంట్గా థియేటర్లో మంచి బజ్‌తో రిలీజైన సినిమాలు గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
యశోద:
సమంత గర్భిణి పాత్రలో నటించిన ఈ చిత్రం నవంబర్ 11న రిలీజై మంచి విజయం సాధించింది. అద్దె గర్భం పేరుతో ఓ ప్రైవేట్ సంస్థ చేస్తున్న మోసాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి హరీ-హరీష్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
మాచర్ల నియోజకవర్గం:
నితిన్ తన కంఫర్ట్ జానర్‌కు భిన్నంగా యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చేదు ఫలితాన్ని అందుకున్నాడు. ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తాజాగా జీ-5లో స్ట్రీమంగ్ అవుతుంది.
ఊర్వసివో రాక్షసివో:
కెరీర్ బిగెనింగ్ నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు అల్లు శిరీష్. ఈ క్రమంలో నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ఊర్వసివో రాక్షసివో సినిమాతో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ డే నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. సినిమా బాగానే ఉన్నా శిరీష్‌కు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
లైక్ షేర్ అండ్ సబ్‌స్రైబ్:
సంతోష్ శోభన్, ఫరియా అబ్ధుల్లా హీరో హీరోయిన్లు నటించిన ఈ చిత్రం నవంబర్ 4న రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. కాగా ఈ చిత్రం సోనిలివ్‌లో గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
వీటితో పాటుగా ఇతర భాషల సినిమాలు:
జీ5 :
బ్లర్ (హిందీ)- డిసెంబరు 9
మాన్సూన్ రాగా (కన్నడ) -డిసెంబరు 9
సోనీలివ్ :
రాయ్ (మలయాళం)- డిసెంబరు 9
ఫాదూ (హిందీ సిరీస్)-డిసెంబరు 9
విట్నెస్ (తమిళ్ చిత్రం)- డిసెంబరు9
నెట్‌ఫ్లిక్స్ :
క్యాట్ (హిందీ సిరీస్)-డిసెంబరు9
మనీ హైస్ట్: కొరియా జాయింట్ ఎకనామిక్ ఏరియా (వెబ్‌సిరీస్2)-డిసెంబరు9
డిస్నీ+హాట్‌స్టార్:
ఫాల్ (తమిళ్)- డిసెంబరు9.