రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న అవతార్-2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అన్ని కోట్లు వచ్చాయా?
జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించి, ఆ లోకంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళాడు. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించింది.
Avatar-2 Movie | ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్-2’. 2009లో వచ్చిన ‘అవతార్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించి, ఆ లోకంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళాడు. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దాదాపు 13ఏళ్ళ తర్వాత అవతార్-2 తెరకెక్కింది. జేమ్స్ కామెరూన్ ఈ సినిమా సీక్వెల్‌ను సముద్ర గర్భంలో ఆవిష్కరించాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించింది.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇండియాలో ఈ సినిమాకు రూ.10 కోట్లు వచ్చాయట. ఈ రికార్డు గతంలో డాక్టర్ స్ట్రేంజ్ పేరిట ఉండేది. ఇక తాజాగా ఈ రికార్డును అవతార్ బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఇలా రికార్డులు సాధిస్తే రిలీజ్ తర్వాత మరెన్నీ సంచలనాలు సృష్టిస్తుందో ప్రేక్షకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో బిజిఎస్ జరిగినట్లు తెలుస్తుంది. కొన్ని హాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలంటే 2బిలియన్ డాలర్లు సాధించాల్సి ఉంటుందని టాక్. ఈ సినిమా దాదాపు 160 దేశాల్లో డిసెంబర్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

