Mounika Reddy Wedding | ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిల మాసం నడుస్తుంది. గతకొన్ని నెలలుగా దక్షిణాదిన వరుసగా పెళ్లి బాజాలు మొగుతున్నాయి. నయనతార మొదలుకొని మంజిమా మోహన్, అధితి శంకర్, హన్సిక వంటి సెలబ్రెటీలు పెళ్ళి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే బాహుబలి సింగర్ కూడా త్వరలో వివాహా బంధంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పుడు వీరి బాటలోనే మరో టాలీవుడ్ నటి పెళ్ళికి ముస్తాభవతుంది.
‘సూర్య’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటి మౌనికా రెడ్డి. ఇటీవలే ‘భీమ్లా నాయక్’లో లేడీ కానిస్టెబుల్‌గా మంచి పాత్ర పోషించింది. కాగా తాజాగా ఈమె పెళ్లి పీఠలెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. కాబోయే భర్తతో దిగిన ఎంగేజ్మెంట్ ఫోటోను పోస్ట్ చేసింది. అయితే అతని వివరాలు మాత్రం వెల్లడించలేదు. మౌనికా రెడ్డి పెళ్లి 17,18లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగనున్నట్లు తెలుస్తుంది.
షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించిన మౌనిక.. ‘సూర్య’ వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా వెబ్‌సిరీస్‌లలో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్ ‘భీమ్లానాయక్’లో లేడీ కానిస్టేబుల్ పాత్ర కోసం ఈమెను ఎంపిక చేశాడు. పవన్ సినిమాలో నటించడంతో ఈమె పేరు టాలీవుడ్లో మార్మోగిపోయింది. ఇక ఇటీవలే రిలీజైన ‘ఓరి దేవుడా’ సినిమాలో కూడా మంచి పాత్ర పోషించింది. ఇక ప్రస్తుతం మౌనిక వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.