SSMB 29 | గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). మహేశ్ బాబు లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటీలో నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారని తెలిసిందే. ఈవెంట్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది ప్రియాంకా చోప్రా. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులు, ఫాలోవర్లతో షేర్ చేసుకుంది. అయితే ప్రియాంకా చోప్రా టైటిల్ ఈవెంట్ ప్రిపరేషన్ కోసమే హైదరాబాద్ వచ్చిందా..? లేదంటే షూటింగ్లో జాయిన్ అయ్యేందుకా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఎస్ఎస్ఎంబీ 29 టీం ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.
ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ఇప్పటికే మేకోవర్ మార్చుకున్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రాన్ని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Dies Irae | మోహన్‌లాల్ కొడుకు కొత్త మూవీ.. ‘డీయాస్ ఈరే’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Peddi First Single | ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ వీడియో పంచుకున్న టీమ్
Mira Nair Son | న్యూయార్క్ మేయర్‌గా భారతీయ దర్శకురాలి కొడుకు.. ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?