Yash | ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మొదట యశ్‌కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు టాక్ నడిచింది. ఆ తర్వాత ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి కరీనాకపూర్ (Kareena kapoor) ఎంపికైనట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ (Huma qureshi) కూడా ఎంపిక అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై హ్యూమా ఖురేషీని సంప్రదించగా.. ఖురేషీ ఒకే చెప్పినట్లు టాక్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.