బాలీవుడ్ భామ దీపికా పదుకొణె అమ్మదనాన్ని ఎంజాయ్ చేస్తున్నది. తన గారాలపట్టి దువాతో కాలమే తెలియడం లేదని చెబుతున్నది. గర్భం ధరించినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్న దీపిక.. సామాజిక మాధ్యమాల్లోకి తరచూ తొంగిచూస్తున్నది. తన అప్డేట్స్ అన్నీ ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నది. ‘తల్లి అయిన తర్వాత మీ సౌందర్యాన్ని ఎలా కాపాడుకుంటున్నారు’ అని కొందరు నెటిజన్లు వేసిన ప్రశ్నకు దీపిక ఫన్నీ జవాబు చెప్పింది. ఒక వ్యక్తి నీళ్లు ముఖంపై చల్లుకున్న వీడియోను షేర్ చేస్తూ.. ఇదే నా స్కిన్ కేర్ బ్యూటీ సీక్రెట్ అంటూ కామెంట్ చేసింది. ఈ పోస్టు సరదా కొద్దీ చేసిందో, తను అదే పాటిస్తున్నదో తెలియక రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.