Thalapathy 67 | స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం దళపతి 67 (Thalapathy 67). విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్నాడు. ‘దళపతి 67 మూవీ షూటింగ్ జనవరి 2న గ్రాండ్‌గా మొదలైంది. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. విజయ్ సార్‌తో మూడోసారి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది..’ అంటూ ఇప్పటికే సెవెన్ స్క్రీన్ స్టూడియో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆసక్తికర అప్డేట్ అందించారు మేకర్స్. కేజీఎఫ్ 2లో విలన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘నేను దళపతి 67 సింగిల్ లైన్ విన్న వెంటనే ఇలాంటి సినిమాలో భాగం అయ్యేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. ఈ సినిమా ప్రయాణం షురూ చేసేందుకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది..’ అని సంజూ భాయ్ తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు. మరి సంజయ్ దత్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
కొరియోగ్రఫర్ సాండీ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా ఈ మూవీకి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తోపాటు రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాకు సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ కాగా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఫిబ్రవరి మొదటి వారంలో దళపతి 67 సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ప్రకటన ఉండబోతుందని ఇటీవలే మైఖేల్ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రకటించిన లోకేశ్.. అంతకుముందే ఇలా అదిరిపోయే న్యూస్‌తో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
We feel esteemed to welcome @duttsanjay sir to Tamil Cinema and we are happy to announce that he is a part of #Thalapathy67 ❤️#Thalapathy67Cast #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @Jagadishbliss pic.twitter.com/EcCtLMBgJj
— Seven Screen Studio (@7screenstudio) January 31, 2023
Very Happy to be associated with the most expected project … Thalapathy 67 …that too as an ACTOR 😍❤️😍
Thank you so much dear @Dir_Lokesh sir for this opportunity !! And sharing screen space with our one and only thalapathy will always be very very special to me ❤️❤️❤️ pic.twitter.com/BxfLJHWTXz— SANDY (@iamSandy_Off) January 31, 2023