ముంబై : బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి.. సూసైడ్ చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంటి ఏడో అంతస్థు నుంచి ఆయన కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనిల్ అరోరా(Anil Arora) ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, సీనియర్ పోలీసు అధికారులు అనిల్ అరోరా ఇంటికి చేరుకున్నారు. అతని పార్దీవదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం పంపించారు. ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు విచారణ చేపడుతున్నారు.