Karthik Aaryan tested COVID-19 Positive | బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కార్తిక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. ఇటీవలే ఈయన నటించిన ‘భూల్ భులైయా-2’ థియేటర్లో విడుదలైంది. రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబడుతుంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ ఈ చిత్రంతో కళకళలాడుతుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.144 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇలాంటి సమయంలో కార్తిక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అంతే కాకుండా కార్తిక్ ఆర్యన్ శనివారం జరుగనున్న ఐఫా 2022 వేడుకలకు హాజరు కావాల్సి ఉంది. ఈ ఈవెంట్లో కార్తిక్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ ఇలా సడెన్‌గా కరోనా రావడంతో ప్లాన్ క్యాన్సిల్ అయింది. ఈ ఈవెంట్లో కార్తిక్ ‘భూల్ భూలైయా-2’ టైటిల్ ట్రాక్‌తో పాటు ‘ధీమె ధీమె’, ‘కోక కోలా’, ‘బోమ్ డిగ్గీ’ పాటలతో పాటు మరికొన్ని సాంగ్స్‌ను లైఫ్ ఫర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంది.