టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లోనూ బాక్సింగ్ జోనర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. బూల్ బులౌయా 2 సినిమాతో హిట్ అందుకున్న యువ హీరో కార్తిక్ ఆర్యన్ తన తర్వాతి సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. చక్దేఇండియా, భజరంగీ భాయీ జాన్ వంటి హిట్ సినిమాలు తీసిన కబీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నాడు. బాక్సర్‌గా కనిపించడం కోసం కార్తిక్ ఇప్పటికే ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. రాజ్‌కోట్‌లో అలియా భట్ సోదరుడు, రాహుల్ భట్ దగ్గర కార్తిక్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. బక్కపల్చగా ఉండే కార్తిక్ బాక్సర్ గెటప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడట. డైట్‌తో పాటు కఠినమైన ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నాడట.
ఇంజినీరింగ్ చదివిన కార్తిక్ ప్యార్ కా పంచనామా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. లుకా చుప్పీ, పతీ పత్నీ ఔర్ వోహ్ వంటి చిత్రాలతో పాపురల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. త్వరలోనే కార్తిక్ నటించిన ఫ్రెడ్డీ సినిమా రిలీజ్ కానుంది. ఇదేకాకుండా షెహ్జద, సత్య ప్రేమ్ కీ కథ వంటి సినిమాలతో కార్తిక్ బిజీగా ఉన్నాడు.