Actor Govinda | బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా (61) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మంగళవారం అర్థరాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో గోవిందా (61)ను జుహులోని ఓ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా తాను క్లేమంగానే ఉన్నానని అభిమానులు కంగరపడవద్దని ఇంటికి చేరుకున్న తర్వాత గోవింద మీడియాకు తెలిపాడు.
నేను ఇప్పుడు బాగానే ఉన్నా. గత కొన్ని వారాలుగా షూటింగ్లు, ప్రమోషన్స్తో ఎంతో బిజీగా గడిపాను. అంతకుముందు జిమ్లో ఓవర్ వర్కౌట్ చేశాను. అలసట, డి హైడ్రేషన్ వలన ఇలా జరిగింది. ఇకపై యోగా, ప్రాణాయామం, మెడిటేషన్కే ప్రాధాన్యం ఇస్తాను. శరీరాన్ని బలవంతం చేయడం కంటే సహజంగా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం అని తెలిసింది. తన కోసం ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ గోవిందా చెప్పుకోచ్చాడు.