Madhuri Dixit | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటనతో 1980-90ల్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన డ్యాన్స్‌తో పాటు నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అయితే ‘బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్’గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్లో కూడా ఒక మరిచిపోలేని చేదు సంఘటన ఉంది. తన కెరీర్లో బిగినింగ్ టైంలో వినోద్ ఖన్నాతో చేసిన ఒక మూవీలో ఈ ఘటన జరిగింది.
1984లో “అబోధ్” సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది మాధురి దీక్షిత్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. అయితే 1988లో బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం దయావన్ (Dayavan). 1987లో కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం నాయకన్ సినిమాకి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో మాధూరి కథానాయికగా నటించగా.. ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించాడు.
అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా వినోద్ ఖాన్నా మాధూరి పెదవులు కొరకడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. చిత్ర షూటింగ్లో భాగంగా.. ఆజ్ ఫిర్ తుమ్ పే ప్యార్ ఆయా హై(Aaj Phir Tum Pe Pyaar Aaya Hai) పాట చిత్రీకరిస్తుండగా.. వినోద్ మాధురిని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సీన్ కంప్లీట్ అయ్యి దర్శకుడు కట్ చెప్పిన అనంతరం కూడా వినోద్ మాధూరిని ముద్దు పెట్టుకోవడం ఆపకపోగా.. ఆమె పెదవి కొరకడంతో రక్తం కారి ఆమె ఏడ్చినట్లు నివేదికలు తెలిపాయి. దీంతో షూటింగ్ అనంతరం మాధురికి వినోద్ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ సినిమా విడుదలయిన అనంతరం ముద్దు సన్నివేశం తొలగించమని దర్శకుడు ఫిరోజ్ ఖాన్‌కి నోటీసులు అందినట్లు సమాచారం. మాధూరి కూడా ముద్దు సన్నివేశం తొలగించమని దర్శకుడిని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సీన్ మాత్రం తొలగించలేదు. ఇక ఈ మూవీ తర్వాత మళ్లీ వినోద్ ఖన్నాతో మాధూరి నటించలేదు. ఈ చిత్రం అనంతరం తేజాబ్, దిల్, బేటా, హమ్ ఆప్కే హై కౌన్ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా మాధూరి ఎదగగా.. వినోద్ ఖన్నా పతనం అక్కడినుంచే ప్రారంభమయ్యింది.