Ranveer Singh Bold Photos Shoot | రణ్వీర్ సింగ్. పరిచయం అక్కర్లేని పేరు.. ఇటీవల ఈ బాలీవుడ్ నటుడి పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూడ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత పలువురు రణ్వీర్ సింగ్‌పై మండిపడ్డారు. ఫొటోషూట్ నేపథ్యంలో నటుడిపై కేసు సైతం నమోదైంది. మహిళల మనోభావాలను కించపరిచాడంటూ ఓ స్వచ్ఛంద సంస్థ చెంబూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు సెక్షన్ 292, సెక్షన్ 293, సెక్షన్ 509, ఇన్పర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్ 67ఏ కింద బాలీవుడ్ నటుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఈ నెల 22న వాంగ్మూలం నమోదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరాడు. అయితే, రణ్వీర్ పోలీసులకు ఎదుట హాజరయ్యేందుకు రెండువారాల సమయం కోరాడు. దీంతో పోలీసులు విచారణకు మరో తేదీని ఖరారు చేసి.. రణ్వీర్ సింగ్‌కు నోటీసులు జారీ చేయనున్నారు. అయితే, ఫొటోషూట్‌పై రణ్‌వీర్‌పై విమర్శలు వెల్లువెత్తగా.. బాలీవుడ్ మాత్రం నటుడికి అండగా నిలిచింది.