Ashok Selvan | తమిళ హీరో అశోక్ సెల్వన్ (Ashok Selvan) బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. బిగ్ బాస్ ఫేమ్ నటి కీర్తి పాండియన్ (Keerthy Pandiyan)ను ఘనంగా వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని తిరుణవేలిలో ఈ వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే వీరిద్దరూ.. ప్రస్తుతం ‘బ్లూ స్టార్’ (Blue Star) అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది. ఇక ఈ మూవీతో ఎస్. జయకుమార్(S Jaya Kumar) దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ (PA. Ranjith) నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు.
అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. వారికి మేకర్స్ విషెస్ చెబుతు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రైలిన్ ఒలిగాల్ (Railin Oligal) అనే రొమాంటిక్ మెలోడీని వదిలారు.
Unveiling our special present to our lovely couple, @AshokSelvan & @iKeerthiPandian💓 Happy married life. Wishing you both only the best✨#RailinOligal from #BlueStar💙⭐ OUT NOW!
A #GovindVasantha Musical
🎙️ @pradeep_1123 @ShakthisreeG
✒️… pic.twitter.com/bWL949Fn4V— pa.ranjith (@beemji) September 13, 2023
ఇక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శంతను భాగ్యరాజ్, పృథ్వీరాజన్, భగవతి పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, లిజీ ఆంటోని, దివ్య దురైసామి, అరుణ్ బాలాజీ, రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.