అగ్ర కథానాయకుడు వెంకటేశ్ తాజా బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టాలీవుడ్ రీజనల్ సినిమాల్లో రికార్డు సృష్టించింది. 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడమే కాక, రీసెంట్గా ఓటీటీలో విడుదలై ఇతర బ్లాక్బస్టర్ల వ్యూవర్‌షిప్‌ని అధిగమించి, దూసుకుపోతున్నది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల ఆధిపత్యం కారణంగా థియేటర్లలో సినిమాలు లాంగ్న్ లేకుండా పోతున్న నేటి రోజుల్లో ఏకంగా 92 సెంటర్లలో 50రోజులు పూర్తి చేసుకుని అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.