Black Movie | బాలీవుడ్ బిగ్ బి అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సినిమా ప్రస్థావన వస్తే ముందుగా మాట్లాడుకునేది ఆయన పేరే. సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందుకున్నారు ఈ బాలీవుడ్ దిగ్గజం. ఎనిమిది పదుల వయసులో కూడా ఇప్పటికి వృత్తిపట్ల ఆయన అదే నిబద్దత, అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. అయితే అమితాబ్ కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలున్నాయి. అందులో ‘బ్లాక్’ (Black) సినిమా ఒకటి. అమితాబ్ బచ్చన్, రాణీ ముఖర్జీ (Rani Mukerji) ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay leela Bhansali) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2005 ఫిబ్రవరి 04న రిలీజై సంచలనం సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.40 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటనకు గాను బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకోవడమే కాకుండా బెస్ట్ మూవీ సహా మూడు అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చి ఇన్నేండ్లు అయిన టీవీలలో టెలికాస్ట్ అయినప్పుడు చూడడమే గానీ.. యూట్యూబ్‌లో గానీ, ఇతర ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో గానీ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు చూద్దామన్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అయితే అభిమానుల నిరాశకు ముగింపుకు పలుకుతూ మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 04 2024 నాటికి 19 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ ఓటీటీ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు.
From darkness to light, celebrating 19 years of Michelle and Debraj’s incredible journey! ✨ #19YearsOfBlack
Watch Black’s Digital Premiere! Streaming now only on @NetflixIndia#SanjayLeelaBhansali #Black@SrBachchan #RaniMukerji @applausesocial @prerna982 #BlackOnNetflix… pic.twitter.com/g88RA6xHjh
— BhansaliProductions (@bhansali_produc) February 4, 2024