Allu Arjun – BJP leader Raghunandan Rao | సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు పంపగా.. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకోని ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యాడు. అల్లు అర్జున్‌తో పాటు అతడి మామ చంద్రశేఖర్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట స్టేషన్‌కు వెళ్లారు. ఇదిలావుంటే తాజాగా సంధ్య థియేటర్‌కు ఘటనకు సంబంధించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించాడు.
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తుందని రఘునందన్ రావు ఆరోపించాడు. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది. ఇది రాష్ట్రంలోని ఇతర చిన్న కేసుల్లాంటిదే. ఈ తొక్కిసలాట ఘటనలో ఆ నటుడి పాత్ర ఎంత వరకు ఉంది.. లేదా పోలీసుల పాత్ర ఎంత వరకు ఉంది. అసలు ఈ ఘటన జరగడానికి పోలీసుల పాత్ర ఎంత వరకు ఉంది.. థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకు ఉంది. ఇందులో ఎవరు విఫలమయ్యారో అనే దానిపై చూడాలి. ఈ కోణంలో చూడటం మానేసి.. ఒక నటుడిని అరెస్ట్ చేసి ఈ ఘటనలో తెలంగాణ ప్రజలను ప్రభుత్వం బ్లేమ్ చేస్తుంది. ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం కావాలని సెన్సేషన్ చేస్తుంది. అల్లు అర్జున్‌ని మీడియా ముందుకు రావోద్దని తెలిపిన పోలీసులు వారు ఎలా మీడియా ముందుకు వచ్చారు. అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు నా విన్నపం. కోర్టు ఇప్పటికే 30 రోజుల బెయిల్ ఇచ్చినందున పోలీసులు ఏ వ్యక్తిపైనా ప్రతీకారం తీర్చుకోకూడదు. అంటూ రఘునందన్ రావు చెప్పుకోచ్చాడు.
#WATCH | Hyderabad | Allu Arjun arrives to appear before Police in Sandhya theatre stampede incident, BJP leader Raghunandan Rao says, “It is a small case. It is like any other small case in the state. What was the role of the Police and the actor in that stampede? Instead of… pic.twitter.com/RkJl33alhO
— ANI (@ANI) December 24, 2024