Dhruv Vikram | కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్ కాలమదన్’. ‘ఆదిత్య వర్మ’, ‘మహాన్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ధ్రువ్ ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘బైసన్’ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్న ధ్రువ్‌కు ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.
So happy to finally share this —
BISON Kaalamadan, my next collaboration with the incredibly talented @mari_selvaraj, is releasing this Diwali, on October 17!This film is raw, real, and made with so much love.
It’s a story that’s close to both our hearts.Can’t wait for you… pic.twitter.com/N655hKNdbi
— pa.ranjith (@beemji) May 3, 2025