Sapthami Gowda | టాలీవుడ్ నటుడు నితిన్ కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన రాబిన్‌హుడ్ చిత్రం కూడా ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో కాంతార నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సప్తమి బర్త్‌డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ ఫొటో చూస్తుంటే.. ట్రైబల్ యువతిగా సప్తమి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు తమ్ముడు సినిమా మొదలై రెండేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ రాలేదు. కేవలం రెండు గ్లింప్స్‌ను మాత్రమే విడుదల చేశారు. మొదట ఈ చిత్రాన్ని 2025 జూలై 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ కారణంగా విడుదల వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం, జూలై 25న ‘తమ్ముడు’ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
Wishing our incredible & powerful “Ratna” aka the incredibly captivating diva @gowda_sapthami! ❤️😍
Her presence & performance both will have you hooked to the screens 💥#HBDSapthamiGowda 🎉
A #SriramVenu Film🎬#Thammudu 🎯@actor_nithiin #Laya #SaurabhSachdeva… pic.twitter.com/nwk21ZGR5f
— Sri Venkateswara Creations (@SVC_official) June 8, 2025