KD The Devil| కన్నడ యాక్టర్ ధ్రువ సర్జా ప్రస్తుతం కేడీ.. ది డెవిల్ (KD The Devil) చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ప్రేమ్ (డెబ్యూ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు సంజయ్ దత్ (Sanjay Dutt), శిల్పాశెట్టితోపాటు రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజాగా ధ్రువ సర్జాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో లుక్ లాంఛ్ చేశారు. ధ్రువ సర్జా ఊరమాస్ అవతార్‌లో బైక్‌పై కత్తి తొడపై పెట్టుకొని రక్తపు మరకలతో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
కేజీఎఫ్.. చాఫ్టర్ 2 సినిమాతో శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చిన సంజయ్‌దత్ మరోసారి కన్నడ సినిమాలో కనిపిస్తుండటంతో సినిమాలు అంచనాలు అమాంతం పెరిగిపోతుఉన్నాయి. కేడీ.. ది డెవిల్ చిత్రం కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధ్రువ సర్జా మరోవైపు కన్నడలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న మార్టిన్‌లో నటిస్తున్నాడు. ఏపీ అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి అర్జున్ సార్జా కథనందించాడు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ధ్రువ సర్జా మాస్ అవతార్..
Birthday wishes to the Action Prince @DhruvaSarja!
Brace yourself for the epic war ahead.#KD is about to ignite the battlefield 🔥#KDTheDevil @directorprems #VRavichandran @duttsanjay @TheShilpaShetty @Reeshmananaiah @KvnProductions @SUPRITH_87#HBDDhruvaSarja pic.twitter.com/g9mVx2zngz
— BA Raju’s Team (@baraju_SuperHit) October 6, 2023
కేడీ ది డెవిల్ టైటిల్ టీజర్..
𝐇𝐚𝐩𝐩𝐲 𝐁𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲 #𝐌𝐚𝐫𝐭𝐢𝐧 𝐃𝐡𝐫𝐮𝐯𝐚 𝐒𝐚𝐫𝐣𝐚❤️
𝐈𝐍𝐃𝐈𝐀’𝐒 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐀𝐂𝐓𝐈𝐎𝐍 𝐒𝐀𝐆𝐀, #𝐌𝐀𝐑𝐓𝐈𝐍 𝐒𝐭𝐫𝐢𝐤𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐒𝐢𝐥𝐯𝐞𝐫 𝐒𝐜𝐫𝐞𝐞𝐧𝐬 𝐒𝐡𝐨𝐫𝐭𝐥𝐲💥
ಮಾರ್ಟಿನ್- మార్టిన్- மார்ட்டின்-
മാർട്ടിൻ- मार्टिन#MartinTheMovie… pic.twitter.com/nYxUhDOlIx— BA Raju’s Team (@baraju_SuperHit) October 6, 2023