రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్డే బాయ్’. విస్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐ.భరత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్ను రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తొమ్మిదేళ్ల క్రితం నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. ఎం.ఎస్. చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు మిత్రుల నేపథ్యంలో కథ నడుస్తుంది. కామెడీ డ్రామాగా ఆకట్టుకుంటుంది’ అన్నారు.