Maya Sabha | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR). ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN)లపై ఒక వెబ్ సిరీస్ రాబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని ఆధారంగా చేసుకుని 1990లో ఉన్న ఆంధ్ర రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు దేవకట్టా మయసభ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమిళ నటుడు ఆది పినిశెట్టి చంద్రబాబు నాయుడి పాత్రలో నటిస్తుండగా.. కీడాకోలా సినిమాతో అలరించిన చైతన్య రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ వేదిక సోని లివ్‌లో ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 07 నుంచి స్ట్రీమింగ్‌లోకి రాబోతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కల్పితం అంటూ ప్రకటించాడు దేవకట్టా.
ఓపెన్ గా బయోపిక్ అని ప్రకటించిన కథలు కూడా కల్పితాలే. డెబ్భై, ఎనభై ఏళ్ల ఒక వ్యక్తి జీవితాన్ని ఎవరైనా మూడు గంటల్లో కల్పితం లేకుండా చెప్పగలరా? ఉన్నతమైన మానవీయ భావాలను పెంచడానికి రాసే కథలు అంతకన్నా కల్పితం. ప్రతి రాజకీయ ప్రక్రియకూ ఇదే ధ్యేయం – శత్రుత్వాన్ని పెంచడం కాదు. ఈ పాత్ర పేరు కృష్ణమ నాయుడు (KKN). పేదరికం, నత్తి లాంటి బలహీనతలను అధిగమించి నాయకుడిగా ఎదిగిన పాత్ర. అంటూ దేవకట్టా రాసుకోచ్చాడు.
ఓపెన్ గా బయోపిక్ అని ప్రకటించిన కథలు కూడా కలిపితాలే. డబ్భై ఎనభై ఏళ్ల ఒక వ్యక్తి జీవితాని ఎవరైనా మూడు గంటల్లో కల్పితం లేకుండా చెప్పగలరా?. ఉన్నతమైన మానవీయ భావాల్ని పెంచడానికి రాసే కథలు అంతకన్నా కల్పితం. ప్రతి రాజకీయ ప్రక్రియకీ ఇదే ధ్యేయం. శత్రుత్వాన్ని పెంచడం కాదు. ఈ పాత్ర పేరు… https://t.co/pxMrO9A0WU
— deva katta (@devakatta) July 19, 2025