నందమూరి కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్లో నటించిన చిత్రం బింబిసార (Bimbisara). ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వశిష్ఠ (Vasistha) దర్శకత్వం వహించాడు. బింబిసార చక్రవర్తి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసార చక్రవర్తిగా, దేవదత్తుడిగా రెండు పాత్రల్లో నటించాడు. బింబిసార ఇటీవలే జీతెలుగులో తొలిసారి ప్రసారమైంది.
తాజా అప్డేట్ ప్రకారం బింబిసార 11.5 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయినప్పటికీ ఏ సినిమా కూడా ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించకపోవడం గమనార్హం. బింబిసార సిల్వర్ స్క్రీన్‌పై మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా టీవీ ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
బింబిసార చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. కల్యాణ్ రామ్ హోంబ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై హరికృష్ణ నిర్మించారు.
బింబిసార టీఆర్పీ రేటింగ్..
KING SIZE BLOCKBUSTER #Bimbisara is a blockbuster on the small screen as well 💥
Records a Sensational TRP of 11.5 in its first telecast 🔥🔥@NANDAMURIKALYAN @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial pic.twitter.com/yj26q5gqVb
— Vamsi Kaka (@vamsikaka) January 19, 2023