Biker vs Rakasa | బాక్సాఫీస్ పోటీ మరింత హీట్… లేటెస్ట్ ట్రెండ్‌లో శర్వానంద్ సినిమానే టాప్
Biker vs Rakasa | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం ఆసక్తికరమైన పోటీ కొనసాగుతోంది. బైకర్, రాకాస చిత్రాలు వేర్వేరు జానర్లకు చెందిన సినిమాలు అయినప్పటికీ, వసూళ్లు మరియు టికెట్ బుకింగ్స్ విషయంలో గట్టి పోటీని ప్రదర్శిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘బైకర్’లో శర్వానంద్ నటనకు మంచి స్పందన లభిస్తుండగా, ఫాంటసీ కామెడీగా వచ్చిన ‘రాకాస’లో సంగీత్ శోభన్ వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Biker vs Raakasa | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం ఆసక్తికరమైన పోటీ కొనసాగుతోంది. బైకర్, రాకాస చిత్రాలు వేర్వేరు జానర్లకు చెందిన సినిమాలు అయినప్పటికీ, వసూళ్లు మరియు టికెట్ బుకింగ్స్ విషయంలో గట్టి పోటీని ప్రదర్శిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘బైకర్’లో శర్వానంద్ నటనకు మంచి స్పందన లభిస్తుండగా, ఫాంటసీ కామెడీగా వచ్చిన ‘రాకాస’లో సంగీత్ శోభన్ వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీకెండ్ వసూళ్లలో ‘బైకర్’ స్వల్ప ఆధిక్యం సాధించగా, గత మూడు రోజులుగా బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ విషయంలో ‘రాకాస’ ముందంజలో నిలిచింది.
అయితే, తాజా ట్రెండ్ ప్రకారం పరిస్థితి మారింది. గత 24 గంటల్లో ‘బైకర్’ మళ్లీ పుంజుకుని సుమారు 15.5 వేల టికెట్లు బుక్ కాగా, ‘రాకాస’ 13.7 వేల టికెట్లతో కొంచెం వెనుకబడింది. దీంతో శర్వానంద్ సినిమా మరోసారి లీడ్ సాధించినట్టైంది.సోమవారం కావడంతో రెండు సినిమాల వసూళ్లలో సహజంగానే డ్రాప్ కనిపించింది. అయినప్పటికీ, కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు స్థిరంగా నిలబడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన, మరియు రిపీట్ వ్యూయింగ్స్ ఈ సినిమాల భవిష్యత్తును నిర్ణయించే అంశాలుగా మారనున్నాయి.
ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ‘బైకర్’ ఎమోషనల్ మరియు స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో లాంగ్ రన్లో నిలబడే అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా, ‘రాకాస’ వినోదాత్మక కంటెంట్‌తో షార్ట్ టర్మ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.మొత్తానికి, ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఇంకా కొనసాగుతుండగా, ప్రేక్షకుల అభిరుచి ఏ దిశగా మళ్లుతుందో అనేది ఈ వారం స్పష్టమయ్యే అవకాశముంది. రానున్న రోజులలో కూడా పెద్ద సినిమాల హంగామా లేదు కాబట్టి ఈ రెండింటికి మంచి వసూళ్లు వచ్చే అవకాశం లేకపోలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

