Biker vs Raakasa | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం ఆసక్తికరమైన పోటీ కొనసాగుతోంది. బైకర్, రాకాస చిత్రాలు వేర్వేరు జానర్లకు చెందిన సినిమాలు అయినప్పటికీ, వసూళ్లు మరియు టికెట్ బుకింగ్స్ విషయంలో గట్టి పోటీని ప్రదర్శిస్తున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘బైకర్’లో శర్వానంద్ నటనకు మంచి స్పందన లభిస్తుండగా, ఫాంటసీ కామెడీగా వచ్చిన ‘రాకాస’లో సంగీత్ శోభన్ వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీకెండ్ వసూళ్లలో ‘బైకర్’ స్వల్ప ఆధిక్యం సాధించగా, గత మూడు రోజులుగా బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ విషయంలో ‘రాకాస’ ముందంజలో నిలిచింది.
అయితే, తాజా ట్రెండ్ ప్రకారం పరిస్థితి మారింది. గత 24 గంటల్లో ‘బైకర్’ మళ్లీ పుంజుకుని సుమారు 15.5 వేల టికెట్లు బుక్ కాగా, ‘రాకాస’ 13.7 వేల టికెట్లతో కొంచెం వెనుకబడింది. దీంతో శర్వానంద్ సినిమా మరోసారి లీడ్ సాధించినట్టైంది.సోమవారం కావడంతో రెండు సినిమాల వసూళ్లలో సహజంగానే డ్రాప్ కనిపించింది. అయినప్పటికీ, కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు స్థిరంగా నిలబడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వర్డ్ ఆఫ్ మౌత్, ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన, మరియు రిపీట్ వ్యూయింగ్స్ ఈ సినిమాల భవిష్యత్తును నిర్ణయించే అంశాలుగా మారనున్నాయి.
ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ‘బైకర్’ ఎమోషనల్ మరియు స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో లాంగ్ రన్లో నిలబడే అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా, ‘రాకాస’ వినోదాత్మక కంటెంట్‌తో షార్ట్ టర్మ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.మొత్తానికి, ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఇంకా కొనసాగుతుండగా, ప్రేక్షకుల అభిరుచి ఏ దిశగా మళ్లుతుందో అనేది ఈ వారం స్పష్టమయ్యే అవకాశముంది. రానున్న రోజులలో కూడా పెద్ద సినిమాల హంగామా లేదు కాబట్టి ఈ రెండింటికి మంచి వసూళ్లు వచ్చే అవకాశం లేకపోలేదు.