Panama: పనామా బ్రిడ్జ్ వద్ద భారీ పేలుడు.. మంటల్లోంచి దూసుకెళ్లిన వాహనాలు.. వీడియో
Panama : పనామా కెనాల్‌పై ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో బ్లాస్ట్ జరిగింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే ఆ సమయంలో బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఘటనకు చెందిన వీడియోలను పోస్టు చేశారు.
పనామా సిటీ: పనామా(Panama) సిటీలో భారీ పేలుడు ఘటన జరిగింది. పనామా కెనాల్‌పై ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో బ్లాస్ట్ జరిగింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే ఆ సమయంలో బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఘటనకు చెందిన వీడియోలను పోస్టు చేశారు. లా బోకాలోని బల్బో వద్ద పేలుడు జరిగింది. దీంతో ఆ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్రాన్స్‌పోర్టు లింకుకు ఈ మార్గమే కీలకమైంది. అయితే పేలుళ్లు నేరుగా బ్రిడ్జ్‌మీద జరగలేదు.
బ్రిడ్జ్ కింద భాగంలో పేలుడు జరగడంతో.. దాని మంటలు బ్రిడ్జ్‌పైకి వ్యాపించాయి. అయితే ఆ సమయంలో కొన్ని వాహనాలు ఆ రూట్లో వెళ్తున్నట్లు వీడియోలో ఉన్నది. సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పనామా అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నది. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్‌ఫైటర్లు ప్రయత్నించారు. సెకండ్ డిగ్రీ బర్నింగ్ కేసులు నమోదు అయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పింది. గాయపడ్డ ఇద్దర్ని రెస్క్యూ చేశారు. మంటల్ని ఆర్పే సమయంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు ఫైర్ ఫైటర్లు గాయపడ్డారు.
భారీ మంటల వల్ల బ్రిడ్జ్ నిర్మాణానికి ఏదైనా లోపం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్ఉతన్నారు. బల్బో ఏరియాకు ఎవరూ వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
WILD FOOTAGE 🔴
A tanker blast near the Bridge of the Americas in Panama City ignited a major fire that spread to 2 additional storage units at the Balboa tank facility. Reports of 3 injuries, no foul play suspected (as of now) pic.twitter.com/GeAcicCVQe
— Open Source Intel (@Osint613) April 6, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

