Biju Menon Thundu Movie | ‘రణం’, ‘ఖతర్నాక్’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మలయాళ నటుడు బిజుమీనన్ (Biju Menon). మలయాళంలో ఆయన ప్రత్యేకమైన పాత్రల్లో అలరిస్తూ వస్తున్నారు. ఆయన లాక్డౌన్లో చేసిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. ఇదిలావుంటే బిజుమీనన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తుండు'(Thundu). ఈ సినిమాతో రియాజ్ షరీఫ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే.. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. బేబీ జాన్ అనే కానిస్టేబుల్ పాత్రలో బిజుమీనన్ కనిపించనున్నాడు. బేబీ జాన్ తన ప్రమోషన్ కోసం పోలీస్ ఆఫీసర్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్ష రాయాల్సి వస్తుంది. అయితే చిన్ననాటి నుంచి పరీక్షలంటే భయపడే బేబీ జాన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షకు చిట్టిలు తీసుకువస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. కామెడీ పోలీస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్, జిమ్షీ ఖలీద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.