Biggboss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆరో వారానికి చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డులతో ఎనిమిది మంది మళ్లీ హౌజ్‌లోకి వచ్చారు. ఇక వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లను రాయల్ క్లాన్‌గా అని పిలుస్తుండగా.. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నవారిని ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ (ఓజీ) అంటూ పిలుస్తున్నారు. అయితే ఈ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుకాగా.. . సీత, విష్ణుప్రియను నయని పావని యష్మీ, విష్ణుప్రియను గౌతమ్, యష్మీ, పృథ్వీని హరితేజ, యష్మీ, సీతను మెహబూబ్, సీత, మణికంఠను టేస్టీ తేజ లు నామినేట్ చేశారు. రోహిణి, అవినాష్, గంగవ్వ లు ఇంకా నామినేషన్స్ చేయాల్సి ఉంది. ఇదిలావుంటే ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా బిగ్ బాస్ నిర్వహాకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. మా నాన్నమ్మ కూడా నా పెళ్లి కోసం ఎన్ని పూజలు చేస్తుందో అని అనగా.. గంగవ్వ బదులిస్తూ.. మరి చేసుకోవ్వచ్చుగా అంటుంది. దీనికి విష్ణుప్రియ నాకు తగిన వీరుడు, ధీరుడు, శురుడు దిగాలా కదా అంటుంది. దీనికి టేస్టీ తేజా నేను వీరుడు, శురుడు లాగా లేనా అంటూ నవ్వులు పూయించాడు. అనంతరం టాస్క్‌లో భాగంగా హౌజ్ మేట్స్ దగ్గరున్నా రేషన్‌ని స్టోర్ రూమ్‌లో పెట్టమంటాడు. దీంతో షాక్ తింటారు హౌజ్ మేట్స్. అనంతరం బీబీ సూపర్ మార్కెట్ తెరచుకోబోతుంది అంటూ చెబుతాడు. అయితే టైమర్ పెట్టి ఆ టైంలోపు గ్రాసారీస్ తెచ్చుకోవాలని అనగా.. నబీల్, నిఖిల్ వెళతారు. అయితే అన్ని తెచ్చుకున్న నబీల్ ఉప్పు ప్యాకెట్ మర్చిపోతాడు. దీంతో బిగ్ బాస్ మాకు ఒక ఉప్పు ప్యాకెట్ కావాలి.. కావాలంటే లగ్గరీ అయిన చికెన్‌ను పెడతాం అంటూ నబీల్ కోరతాడు. దీనికి స్పందించిన బిగ్ బాస్.. ఉప్పును పోందడానికి మీకోక అవకాశం అంటూ ఒక్కొక్క ఉప్పు ప్యాకెట్ ధర కేవలం రూ.50 వేలు మాత్రమే కావాలంటే తీసుకోవచ్చు అని చెబుతాడు. అయితే ఈ మనీ కంటెస్టెంట్ల ప్రైజ్ మనీ నుంచి కట్ చేసుకుంటానని తెలిపాడు. దీంతో ఈరోజు హౌజ్‌లో ఏం జరుగుతుంది అనేదాని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.