Bigg Boss9 Telugu | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లో ఐదో వారం ఎపిసోడ్లో డ్రామా, వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ వారం కూడా కెప్టెన్‌గా కళ్యాణ్ కొనసాగుతుండగా, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఇంటి వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. వారు మాట్లాడితే గొడవలు, టాస్క్ అంటే తగాదాలు ఇలా ప్రతి క్షణం టెన్షన్ పెంచుతున్నారు. దీంతో ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులకూ చిరాకు తెప్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం, “కెప్టెన్సీ ఏ” అనే టాస్క్ కోసం పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్స్ మధ్య పోటీ నడిచింది. బిగ్‌బాస్ ఇచ్చిన నియమాల ప్రకారం బజర్ మోగగానే సెంటర్ లైన్ వద్ద ఉంచిన బాల్‌ను తీసుకుని, ప్రత్యర్థి టీమ్ గోల్‌పోస్ట్‌లో వేసిన వారు తమ టీమ్ నుండి ఒక సభ్యుని ఎలిమినేట్ చేసే హక్కు పొందుతారు.
ఈ టాస్క్‌లో పాత కంటెస్టెంట్స్ అయిన సుమన్ శెట్టి, తనూజ, భరణి, సంజన, దివ్య పాల్గొన్నారు. గేమ్ మొదలైన వెంటనే రెండు టీమ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. బాల్ కోసం భరణి, రమ్య మధ్య తగాదా జరిగింది. ఈ క్రమంలో భరణి రమ్యపై పడడంతో ఆమె తలకు గాయం అయింది. తర్వాత “ఫైర్ స్ట్రామ్స్” టీమ్ గోల్ సాధించడంతో పాయింట్ పొందింది, వెంటనే భరణిని ఎలిమినేట్ చేశారు. టాస్క్ మధ్యలో గౌరవ్ తనను పుష్ చేశాడంటూ తనూజ బిగ్‌బాస్‌కి ఫిర్యాదు చేసింది. ఈ విషయం పై గౌరవ్, నిఖిల్, తనూజ మధ్య వేడి వేడి చర్చ నడుస్తుండగా , మధ్యలోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది. దీంతో తనూజ మండిపడి “నేను సంచాలక్‌తో మాట్లాడుతున్నా.. మధ్యలోకి ఎందుకు వస్తావ్?” అంటూ గట్టిగానే వాదించింది.
ఈ టాస్క్‌లో ప్రతి ఒక్కరూ కెప్టెన్సీ టైటిల్ కోసం ప్రాణం పెట్టి పోరాడుతున్నారు. ప్రోమో ప్రకారం, గేమ్‌లో ఫిజికల్ కాంటాక్ట్, తగాదాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ఇంట్లో వాతావరణం మరింత వేడెక్కింది. మొత్తానికి, బిగ్‌బాస్ సీజన్ 9 ఐదో వారం ఎపిసోడ్లో డ్రామా, ఘర్షణలు, ఎమోషన్స్ ప్యాకేజ్‌గా కనువిందు చేయనున్నాయి. ప్రేక్షకులు కూడా “ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారు?” అన్న ఆసక్తితో చూస్తున్నారు.