Bigg Boss9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మంగళవారం (30వ రోజు) ఎపిసోడ్ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది. ఈసారి హౌజ్‌లోని కంటెస్టెంట్లు ఫుల్ ఫ్రీ అయ్యారు. ఒకవైపు నవ్వులు, మరోవైపు ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇమ్మాన్యుయెల్ కామెడీ షోతో సందడిగా మారగా, సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకోవడంతో హౌజ్ ఒక్కసారిగా భావోద్వేగంగా మారిపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఇచ్చిన రెండు టాస్క్‌లు హౌజ్‌లో టెన్షన్ వాతావరణం సృష్టించాయి. ఇక హౌజ్‌లోని సభ్యులు సరదాగా కూర్చొని గుసగుసలు పెట్టుకున్నారు.
హౌజ్ నుంచి బయటకు వెళితే ఎవరిని మొదట కలుస్తారు? అన్న ప్రశ్నతో అందరూ నవ్వులు పూయించారు. భరణి తను దివ్య, తనూజలను కలుస్తానని చెప్పగా, సుమన్ శెట్టి “ఫ్లోరాను కలుస్తా” అన్నారు. దాంతో ఇమ్మాన్యుయెల్ సెటైర్లు వేసి నవ్వులు పంచాడు. తనూజ మాట్లాడుతూ “బయటకు వెళ్లగానే నాన్నను కలుస్తా అంటూ ఆ తర్వాత అమ్మతో పోల్చుతూ ఇమ్ము అంటే ఇష్టమని చెప్పింది. దీంతో ఇమ్మాన్యుయెల్ ఆనందంతో ఉప్పొంగిపోయి… ఇంకా రెండు నెలలు ఉంటే పడేస్తానని చెప్పుకొచ్చాడు. అమ్మ కావాలని తనూజ బుంగమూతి పెట్టుకోగా, ఇప్పటికిప్పుడు అమ్మ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాడని భరణిని ఉద్దేశించి కామెంట్ చేయగా, . నీకు మొగుడు కావాలంటే నేను వస్తానని ఇమ్మూ చెప్పడం విశేషం.
తనూజ “అమ్మ కావాలి” అంటూ భావోద్వేగానికి లోనవగా, ఇమ్మూ ఫన్నీ రియాక్షన్స్ అందరిని అలరించాయి. ఇక సుమన్ శెట్టి తన కుటుంబం గుర్తు వచ్చిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనను భరణి ఓదార్చగా, హౌజ్‌లోని ఇతర కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్ అయ్యారు. తనూజ, రీతూ, సంజనా, శ్రీజ, దివ్య ఇలా అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక 30 వ రోజు జరిగిన మొదటి టాస్క్‌లో కంటెస్టెంట్లు తమ బాక్స్‌లో ఇసుక పోసి, ఎక్కువసేపు హోల్డ్ చేయాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో పవన్, రీతూ చౌదరీ విజేతలుగా నిలిచారు. భరణి, కళ్యాణ్, సంజనా, సుమన్ శెట్టి తదుపరి స్థానాల్లో నిలిచారు. రెండో టాస్క్‌లో బెలూన్స్ హోల్డ్ చేయడం ఉండగా, అందరూ పౌల్ గేమ్ ఆడడంతో బిగ్‌బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటని అర్థం చేసుకోలేకపోయారు… సరిగా ఆడకపోతే దాని ఫలితం ఉంటుంది అంటూ హెచ్చరించారు. ఇక ఈ వారం నామినేట్ అయినవారు డేంజర్ జోన్లో ఉన్నారు. త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. వాళ్లు హౌజ్‌లోకి వస్తే మీ గేమ్ మరింత కఠినమవుతుంది అన్న మాటలతో కంటెస్టెంట్లు టెన్షన్లో పడ్డారు.