Bigg Boss Telugu – Mid Week Elimination | గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఆకుల వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షో స్టార్ట్ అయ్యి నాలుగు వారాలు గడుస్తుండగా.. రోజురోజుకి రసవత్తరంగా సాగుతుంది. 14 మందితో స్టార్ట్ అయిన ఈ షోలో ఇప్పడు 10 మంది ఉన్నారు. ఈ వారం మరో 8 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే సోనియాను బయటకు పంపిచేసిన అనంతరం నాగార్జున ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్లో హౌజ్ నుంచి ఎవరు వెళ్లిపోతున్నారు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు. నబీల్, విష్ణుప్రియ, నిఖిల్, నైనిక, ఆదిత్య ఓం, నాగ మణికంఠ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఇందులో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. కిందటివారం లాగా.. హౌజ్‌మేట్స్ ఏకాభిప్రాయంతో తీసుకుని ఎలిమినేట్ చేస్తారో లేదా.. ఆడియన్స్ ఓట్లని లెక్కలోకి తీసుకొని లీస్ట్ ఉన్నవారిని బయటకు పంపిస్తారో అనేది చూడాలి. ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లు ఉంది ఎవరికి అని చూసుకుంటే.. నైనికతో పాటు ఆదిత్య ఓం ఉన్నారు. అయితే ఆడియన్స్ ఓటింగ్.. హౌజ్‌మేట్స్ ఏకాభిప్రాయం లేకుండా బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటే హౌజ్ నుంచి ఆదిత్య బయటికి వెళ్లే అవకాశం ఉంది. కానీ మంగళవారం ఎపిసోడ్లో ఒక టాస్క్ గెలిచి తానేంటో నిరుపించుకున్నాడు ఆదిత్య. అయితే ఈ రెండ్రోజుల్లో ఓటింగ్‌ను బట్టి రిజల్ట్స్ తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు నైనికకు ఎక్కువగా ఫ్యాన్ బేస్ లేకపోవడంతో తనకి ఓటింగ్ చాలా తక్కువగా ఉంది. ఇక ఓటింగ్ లో నబీల్, నిఖిల్ టాప్ లో ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే నబీల్ 26.22 శాతం ఓటింగ్‌తో టాప్‌లో కోనసాగుతుండగా.. అనుకోకుండా నామినేషన్స్‌లోకి వచ్చిన నిఖిల్ 25.62 శాతం ఓటింగ్‌తో అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు. వీరితో పాటు మణికంఠ 18.94 శాతం ఓట్లతో టాప్ 3లో ఉన్నాడు. యాంకర్ విష్ణుప్రియ (14.51 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్లోకి వెళుతుంది. అయితే ఆదిత్య ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేస్తూ.. ఓటింగ్‌లో దూసుకుపోతే విష్ణుప్రియ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాగా.. రేపటి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.