Bigg Boss Telugu 8 Grand Finale | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. 14 వారాలుగా ప్రేక్షకులను అలరిస్తు వస్తున్న ఈ షో ముగియడానికి ఈ వారమే మిగిలింది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు నిర్వహాకులు. అయితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌లు (అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్) ఉండగా… ఇందులో నుంచి ఒకరు మాత్రమే బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలవనున్నారు. అయితే ఈ ట్రోఫీ అందించడానికి టాలీవుడ్ నుంచి స్టార్ హీరో రాబోతున్నట్లు తెలుస్తుంది.
బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అల్లు అర్జున్ ఫినాలేకి రానున్నారనే టాక్ ఇప్పటికే నెట్టింట జోరుగా నడుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు బిగ్ బాస్ ప్రేక్షకులకు పండగనే చెప్పాలి.