Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం చివరిరోజుకు చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, కిరాక్ సీత ఎలిమినేట్ అవ్వగా.. గత వారం నాగమణికంఠ హౌజ్ నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఈ వారం హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై బిగ్ బాస్ లవర్స్‌తో పాటు ప్రేక్షకులకు ఆసక్తి మొదలైంది.
ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఉన్నారు అనేది చూసుకుంటే.. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావనిలు నామినేషన్లో ఉన్నారు. ఇందులో ఈ వారం అత్యధిక ఓటింగ్ నిఖిల్‌కు ఉండడంతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ప్రేరణ రెండో స్థానంలో కొనసాగుతోంది. కొత్త మెగా చీఫ్ విష్ణు ప్రియ మూడు, పృథ్వీ నాలుగో స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్లో మెహబుబ్‌తో పాటు నయన్ పావనిలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారు అనేది రేపు తెలియనుంది.
ఇదిలావుంటే దీపావళి పండగ సందర్భంగా ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించి స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో హౌజ్‌మేట్స్ అంతా కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడంతో హౌజ్ అంతా సందడిగా మారింది. ఇక దీనితో పాటు హౌజ్ కంటెస్టెంట్లను ఎంటర్టైన్ చేయడానికి.. సాయి పల్లవి, శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్, వెంకి అట్లూరి, అనసుయ, కిరణ్ అబ్బవరం, నయన్ సారిక రావడంతో హౌజ్ అంతా పార్టీలా మారడం ప్రోమోలో చూడవచ్చు.