Bigg Boss Telugu 8 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఏడో వారం రసవత్తరంగా సాగుతుంది. గతవారం కిర్రాక్ సీతను బయటకు వెళ్లగా ఈ వారం ఎవరు వెళుతున్నారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు 9 మంది అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఎవరెవరు నామినేట్ అయ్యింది అనేది చూసుకుంటే.. గౌతమ్, పృథ్వీ, నిఖిల్ మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు. దీంతో ఇందులో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ వారం తెలియనుంది. అయితే ఈరోజు టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌కి క్రేజీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా కొత్త ప్రోమోను వదిలాడు.
ఈ ప్రోమోలో.. ఇది 2050వ సంవత్సరం. వరల్డ్ అంతా ఓవర్ స్మార్ట్‌గా మారిపోయింది. ఇంతకుముందు ఆస్తుల కోసం భూములు కోసం గొడవలు జరిగేవి. కానీ 2050లో ఛార్జింగ్ కోసం గోడవపడడమే ఓవర్ స్మార్ట్ లోకం యొక్క నైజాం. ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న ఓవర్‌స్మార్ట్ ఫోన్స్‌గా రాయల్ క్లాన్స్.. గార్డెన్ ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న ఓవర్‌స్మార్ట్ ఛార్జర్స్‌గా ఓజీ క్లాన్ ఉండబోతున్నట్లు బిగ్ బాస్ తెలిపాడు. అయితే ఛార్జింగ్ తక్కువగా ఉన్న ఓవర్‌స్మార్ట్ ఫోన్స్ సభ్యులు ఏం చేశారు అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే అంటున్నాడు బిగ్ బాస్. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.