Bigg Boss Telugu | రసవత్తరంగా సాగుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో వారం ఎలిమినేషన్‌కు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి, బేబక్కతో పాటు తెలంగాణ పోరడు అభయ్, శేఖర్ భాషా ఎలిమినేషన్ అవ్వడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని హౌస్ మేట్స్‌తో పాటు ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్లో ఆరుగురు హౌజ్‌మేట్స్ ఉండగా.. అందులో నుంచి ఎవరు హౌస్ బయటకు వెళతారు అనేది నేడు తెలియనుంది. ఇక నామినేషన్ అయిన హౌజ్‌మేట్స్ చూసుకుంటే.. సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ శెట్టి, నబిల్, ప్రేరణ కంబం, నాగ మణికంఠ నామినేషన్లలో ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ గత సోమవారం రాత్రి మొదలై శుక్రవారం రోజు పూర్తయింది. ఈ వారం వైల్డ్ కార్డ్‌తో 12 మంది ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నాగార్జున హౌస్‌లో బాంబు పేల్చడంతో ఆ ఎంట్రీలను ఆపేందుకు హౌస్ మేట్స్ శతవిధాలా ప్రయత్నించారు. ఇక వారిని ఆపేందుకు బిగ్ బాస్ మూడు టాస్క్‌లను ఇవ్వగా.. ఆ మూడు గేమ్‌లను గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపారు. అయితే దీని తర్వాత రేషన్ కోసం టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే వీకెండ్ రాగా.. నాగార్జున కూడా వచ్చి ఈ వారం రివ్యూ ఇచ్చాడు.
హౌస్ మేట్స్‌కి ఒక అవకాశం ఇస్తూ.. హౌస్‌లో హీరోలా ఆడుతుంది ఎవరు.. జీరోలా ఆడుతుంది ఎవరు..? అని చెప్పాలన్నారు. దీనికి కంటెస్టెంట్లు అందరూ.. హీరోలా ఆడుతున్న వారికి కిరీటం పెట్టి జీరో అనుకుంటున్న వారి ముఖం మీద క్రాస్ మార్క్ వేశారు. ఇందులో మణికంఠకు ఎక్కువ క్రాస్ మార్కులు వచ్చాయి. దీంతో నాగార్జున మాట్లాడుతూ.. హౌజ్ ప్రకారం నీ ఆట జీరో అనిపిస్తుంది.. నువ్వు కూడా దానికి ఒప్పుకుంటున్నావ్.. నీకు ఎక్కువ జీరోస్ వచ్చినందుకు నువ్వు డైరెక్ట్‌గా డేంజర్ జోన్లోకి వెళ్లావ్ అంటూ నాగ్ చెప్పారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ అయ్యేందుకు డేంజర్ జోన్‌కి వచ్చే ఇద్దరి క్యాండెట్స్‌లో మణికంఠ ఒక్కడని తెలిసిపోయింది. మరోవైపు ఎక్కువ హీరోలు వచ్చి నబీల్ సేఫ్ జోన్లోకి వెళ్లిపోయాడు.
అయితే డేంజర్ జోన్లో మణికంఠతో పాటు మరో కంటెస్టెంట్ సోనియా కూడా వచ్చేసింది. ఇప్పటికే సోనియా ఆట వలన విసిగిపోయిన ప్రేక్షకులు హౌస్ నుంచి సోనియాను పంపేయాలంటూ యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నేడు రాత్రి తెలియనుంది. మరోవైపు హౌస్ నుంచి సోనియాను ఎలిమినేట్ చేసినట్లు వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తక్కువ ఓట్లు నమోదు కావడంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి సోనియా బయటకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. కాగా దీనిపై నేడు రాత్రి ఎపిసోడ్లో క్లారిటీ రానుంది.