Bigg Boss 9 | ప్రస్తుతం ‘బిగ్ బాస్’ కార్యక్రమం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విజయవంతంగా సాగుతోంది. తెలుగులో మాదిరిగానే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 కూడా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నెలరోజులు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం మొత్తం 20 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో 15 మంది మొదటి నుంచే ఉన్నప్పటికీ, ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో నలుగురు హౌస్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ 9 ఐదో వారంలోకి ప్రవేశించింది. ఈ వారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. వినోద్, వియానా, శబరి, విక్రమ్, పార్వతి, కమ్రుదిన్, ప్రవీణ్, కెమి, తుషార్, దివాకర్, రమ్య జో తదితరంగా మొత్తం 12 మంది నామినేట్ అయ్యారు.
అయితే ఈ వారం హౌస్లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లు కమ్రుదిన్, ప్రవీణ్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ ఘర్షణ క్రమంగా కొట్టుకునే స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు అరుస్తూ, తోసుకుంటూ కనిపించిన ఈ దృశ్యాలు ప్రోమోలో స్పష్టంగా కనిపించాయి. ఇతర కంటెస్టెంట్లు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాలేదు. కొందరు మహిళా కంటెస్టెంట్స్ ఈ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ రియాక్షన్పైనే ఉంది. అలాగే హోస్ట్ విజయ్ సేతుపతి ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ ఘర్షణ తర్వాత హౌస్లో పరిస్థితి ఎలా మారుతుందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థితులు బిగ్ బాస్ చరిత్రలో జరగడం చాలా అరుదు. సాధారణంగా, బిగ్ బాస్ నిబంధనల ప్రకారం కంటెస్టెంట్లు ఒకరినొకరు భౌతికంగా తాకడానికి అనమతి లేదు. అలాంటిది ఇలా దాడి చేసుకోవడం తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అసలు ఇతర ఇంటి సభ్యులు వారిని కంట్రోల్ చేయకపోతే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లి ఉండేదో అని ఆలోచన చేస్తూ భయాందోళనకి గురవుతున్నారు.
#Day30 #Promo1 of #BiggBossTamil
Bigg Boss Tamil Season 9 – இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason9 #OnnumePuriyala #BiggBossSeason9Tamil #BiggBoss9 #BiggBossSeason9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #BiggBossSeason9 #VijayTV #VijayTelevision pic.twitter.com/jrFCHSPK8j
— Vijay Television (@vijaytelevision) November 4, 2025