Bigg Boss 9 | కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఉన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. దసరా సంబరాల పేరుతో హౌస్ మొత్తం ఉత్సాహంగా మారింది. పలువురు సినీ తారలు సందడి చేయగా, కిరణ్ అబ్బవరం తన కె ర్యాంప్ మూవీ విశేషాలను పంచుకున్నారు. సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా తెలుసు కదా సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. రితిక నాయక్ స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. దసరా భాగంగా నాగార్జున రీతూ చౌదరి, రాము, సంజనలకు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించారు. రీతూ చౌదరి తినే వేగం చూసి ఇమ్మాన్యుయేల్ ఫన్నీ కామెంట్స్ చేయడంతో హౌస్ లో అందరు తెగ నవ్వేసుకున్నారు.
తర్వాత ఐదుగురు కంటెస్టెంట్స్ …రీతూ చౌదరి, హరీష్, సంజన గల్రాని, డిమాన్ పవన్, రాము కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు. వారికి ఇచ్చిన బుట్టబొమ్మ టాస్క్ లో డిమాన్ పవన్ అత్యధిక వస్తువులు సేకరించి విజేతగా నిలిచాడు. దీంతో ఆయన రెండోసారి కెప్టెన్‌గా ఎంపికయ్యారు. నామినేషన్స్‌లో ఉన్న ప్రియా శెట్టి, కళ్యాణ్‌ల మధ్య చివరిగా ఉత్కంఠ నెలకొంది. యాక్టివిటీ ఏరియాలో ఏర్పాటు చేసిన సింహం గేమ్‌లో సింహం కళ్యాణ్ వైపు ఆగడంతో ఆయన సేఫ్ అయ్యారు. దీంతో ప్రియా శెట్టి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ప్రియా హౌస్‌మేట్స్‌కి ఎమోషనల్‌గా గుడ్‌బై చెప్పి బయటకు వచ్చింది. నాగార్జున ఆమె జర్నీ వీడియో చూపించారు. ప్రియా మాట్లాడుతూ తాను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని తెలిపింది.
ఎలిమినేషన్‌కి ముందు నాగార్జున, ప్రియాతో హౌస్‌లోని ఐదుగురికి డెవిల్ హార్న్స్ ఇవ్వమని కోరారు.
హరీష్‌కు – “తప్పులు ఒప్పుకునే మనస్తత్వం లేదు” అన్నారు.
తనూజకు – “ఎక్కువగా అలుగుతుంది” అన్నారు.
భరణికి – “ప్రతి ఒక్కరినీ సిల్లీ కారణాలతో నామినేట్ చేస్తారు” అన్నారు.
కళ్యాణ్‌కు – “గేమ్‌పై ఫోకస్ చేయకుండా ఫ్రెండ్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు” అన్నారు.
ఇలా దసరా స్పెషల్ ఎపిసోడ్ వినోదం, ఎమోషన్స్‌తో కలగలసి చివర్లో ప్రియా శెట్టి ఎలిమినేషన్‌తో ముగిసింది.