Bigg Boss Season 7 | గత రెండు సీజన్లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయిన బిగ్ బాస్ (Bigg Boss) ఈసారి మాత్రం టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 7 ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ హీరోలు ఎవరనేది చూసుకుంటే.. ఒకరు ఈ ఏడాది ‘భగవంత్ కేసరి’తో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ కాగా.. ఇంకొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. శని, ఆది వారాల్లో జరిగే ఒక ఎపిసోడ్‌కు వీరిద్దరూ రాబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై బిగ్ బాస్ నిర్వహకులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక ఈ వారం ఏడో సీజన్‌కు ఎండ్ కార్డు పడనుంది. ఆదివారం విన్నర్ ఎవరో.. రన్నర్ ఎవరో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అవుతాడని.. రన్నర్‌గా శివాజీ నిలుస్తాడని అంటున్నారు. ఇందులో నిజమెంటో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.