మంగళవారం జరిగిన జీవితమే ఒక టాస్క్ మొదటి రౌండ్ ఆటలో శ్రీరామచంద్ర తన స్ట్రాటజీని ప్లే చేశాడు. ముందుగా వచ్చినా కూడా సేఫ్ జోన్లోకి అడుగుపెట్టలేదు. అతని చేతిలో కాజల్ బొమ్మఉండడంతో శ్రీరామ్, కాజల్ డేంజర్ జోన్లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్లో ఉన్న ఇంటి సభ్యుల మెజార్టీ అభిప్రాయంతో శ్రీరామ్‌కు రెండో రౌండ్‌కు వెళ్లాడు. కాజల్ అవుట్ అయింది.
రెండో రౌండ్లో జెస్సీ.. సన్నీ ఫోటో బ్యాగ్‌తో చివరగా వెళ్లడంతో.. ఇద్దరు డేంజర్ జోన్లోకి వెళ్లారు. వీరిలో జెస్సీ సేఫ్ అయ్యాడు. మూడో రౌండ్లో జెస్సీ చివరగా రావడం, అతని చేతిలో సిరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉండటంతో సేఫ్జోన్లో ఉన్న ఇంటి సభ్యుల అభిప్రాయంతో సిరి సేవ్ అయింది. సన్నీ డేంజర్ జోన్‌కి వెళ్లాడు. నాల్గో రౌండ్లో విశ్వ ఫోటోతో శ్రీరామ్ చివరగా వచ్చాడు.దీంతో ఆ ఇద్దరు డేంజర్ జోన్లోకి వెళ్లగా.. శ్రీరామ్‌ని సేవ్ చేశారు. దీంతో విశ్వ బయటకు పంపారు.
ఐదో రౌండ్లో సిరి లేట్‌గా రావడం.. ఆమె చేతిలో రవి ఫోటో ఉన్నబ్యాగు ఉండడంతో ఇద్దరు డేంజర్ జోన్లోకి వెళ్లారు. వీరిలో సిరి ఔట్ అయింది. ఆరో రౌండ్లో ప్రియాంక, ఏడో రౌండ్లో రవి ఔటయ్యారు. ఎనిమిదో రౌండ్లో మానస్, యానీ మాస్టర్ డేంజర్ జోన్లోకి వెళ్లగా.. శ్రీరామ్ నిర్ణయంతో యానీ మాస్టర్ నెక్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయింది. అలా చివరకు శ్రీరామచంద్ర, యానీ మాస్టర్ ఉండటంతో.. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లతో అనీ మాస్టర్‌కు ఇమ్యూనిటీ లభించింది.