బిగ్ బాస్ సీజన్5 కార్యక్రమంకి సంబంధించిన లీకుల పర్వం కొనసాగుతుంది. ఒక రోజు ముందుగానే ఎవరు కెప్టెన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు నామినేషన్లో ఉంటారనే విషయాలు తెలిసిపోతున్నాయి. ఆదివారం రోజు దీపావళి ఎపిసోడ్ సందడిగా సాగగా, కార్యక్రమం చివరిలో లోబో ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. లోబో ఎలిమినేట్ కాబోతున్న విషయం ఎప్పుడో బయటకు వచ్చింది.
ఇక సోమవారం అంటే బిగ్ బాస్ హౌజ్ నామినేషన్ ప్రక్రియతో హోరెత్తిపోతుంటుంది. తొమ్మిదో వారం నామినేషన్లో ఎవరెవరు ఉంటారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొనగా,తాజాగా కీలక సమాచారం బయటకు వచ్చింది. సిరి, సన్నీ, శ్రీరామ్, జెస్సీ, కాజల్, విశ్వ, మానస్,ప్రియాంక, రవి ఇలా మొత్తంగా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్టు తెలుస్తుంది. వీరిలో విశ్వ బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు రవి ఈ వారం కూడా నామినేషన్లో నిలవడం గమనర్హం.