Bigg Boss | సీరియల్స్, సినిమాలలో నటించి పెద్దగా గుర్తింపు తెచ్చుకోని వారు బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అవుతున్నారు. ఆ జాబితాలో సోనియా ఆకుల తప్పక ఉంటుంది. ఆర్జీవీ తీసిన “కరోనా వైరస్” సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు పెద్దగా ఫోకస్ కాలేదు. లా చదువుకున్న ఆమె, బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. లాయర్‌గా చేసిన అనుభవంతో నామినేషన్ల సమయంలో దూకుడుగా వాదిస్తూ ఆకట్టుకుంది. కానీ నిఖిల్, పృథ్వీతో ఆమె నడిపిన “పెద్దోడు-చిన్నోడు” ట్రాక్‌ను ప్రేక్షకులు సరిగ్గా స్వీకరించలేకపోయారు. ఫలితంగా ఆమె తక్కువ సమయంలోనే హౌస్‌ను వీడాల్సి వచ్చింది.
ఇటీవల గుడ్‌న్యూస్‌తో అభిమానులను ఉత్సాహపరిచింది సోనియా ఆకుల . తాను తల్లికాబోతున్న సంగతి భర్త యష్ వీరగోనికి సర్ప్రైజ్గా చెప్పిన ఆమె ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఇప్పుడు సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టీవీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా సీమంతానికి సీరియల్ నటి కీర్తి భట్ తన ప్రియుడు కార్తిక్‌తో కలిసి హాజరైంది. ఈ వేడుకలో తీసిన ఓ వీడియోను కీర్తి సోషల్ మీడియాలో పంచుకుంటూ, “నా హృదయానికి దగ్గరైన వాళ్లు… హ్యాపీ సీమంతం అక్కా, బావా. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండండి… ఇట్లు, పిన్ని” అని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో కీర్తి సోనియాను ఆలింగనం చేసుకుని, అక్షింతలు వేసి బుగ్గపై ముద్దుపెట్టడం అభిమానుల మనసులను గెలుచుకునేలా చేసింది.
భానుశ్రీ, అమర్‌దీప్‌లతో పాటు పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీరియల్ ఆర్టిస్ట్స్ కూడా వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక సోనియా కెరీర్ జర్నీపై ఓ లుక్కు వేస్తే.. సోనియా ఆకుల మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయింది. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సోనియా తన ప్రియుడు, బిజినెస్‌మ్యాన్ యష్ వీరగోనితో నిశ్చితార్థం జరుపుకుంది. ఆ వెంటనే వివాహం కూడా చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో నిఖిల్ హాజరు కాలేదు. ఇక ప్రస్తుతం సోనియా తల్లికాబోతుండగా, తాజాగా జరిగిన సీమంత వేడుకలో పృథ్వీ హాజరయ్యాడా? అన్నది ఇంకా స్పష్టత లేదు.