Bigg Boss Agnipariksha | పాశ్చాత్య దేశాల్లో బిగ్ బ్రదర్‌గా ప్రారంభమైన రియాలిటీ షో, భారత్‌లో బిగ్ బాస్‌గా మారి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక భాషల్లో ఈ షోకి దాదాపు పర్మినెంట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తెలుగు వర్షన్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభించడంతో, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలవుతోంది. హోస్ట్‌గా నాగార్జున మరోసారి మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఇప్పటి వరకూ సెలబ్రిటీలే హౌస్‌లోకి అడుగుపెట్టేవారు. కానీ గత కొన్ని సీజన్లుగా సామాన్యులకు కూడా అవకాశం ఇస్తూ, టీఆర్పీ రేటింగ్స్‌ను పెంచేందుకు నిర్వహకులు కొత్త స్ట్రాటజీకి తెర తీశారు.
ఈసారి ఏకంగా ఐదుగురు సామాన్యులు హౌస్‌లోకి వెళ్లేందుకు ఎంపిక కానుండటంతో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆగస్టు 22 నుంచి ప్రసారం కానున్న ఈ ప్రీ-షోలో 40 మంది సామాన్యులు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే 100లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో నేరుగా, ఆన్లైన్ ఇంటర్వ్యూలు, వీడియో కాల్స్ ఆధారంగా 40 మందిని ఎంపిక చేశారు.ఈ అగ్నిపరీక్షలో టాస్కుల ద్వారా వారు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. చివరికి 15 మందిని షార్ట్‌లిస్ట్ చేసి, ఆపై మరోసారి స్క్రీనింగ్ చేసి చివరికి 5 మందిని హౌస్‌లోకి పంపించనున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జెస్‌గా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు బిందు మాధవి, నవదీప్ , అభిజిత్ వ్యవహరిస్తుండగా, యాంకర్‌గా శ్రీముఖి కనిపించనున్నారు.
స్టార్ మా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో 40 మంది కాంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒక్కో యూనిక్ స్టైల్లో వచ్చి సందడి చేశారు. ఒక యువతి నైట్డ్రెస్లో పళ్ళు తోముకుంటూ స్టేజ్‌కి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ స్ట్రాంగ్ కామెంట్స్‌తో ముందుగానే హౌస్‌కి వార్నింగ్ ఇచ్చింది. ఒక యువకుడు బ్లాక్ మాస్క్‌తో ఎంట్రీ ఇస్తూ “నువ్వు కూల్‌డ్రింక్ కాదురా.. కషాయం లా ఉంటావ్ అనడంతో బిందు మాధవి కషాయం కాదు.. విషం అంటూ స్పందించింది. మరో వ్యక్తి హ్యాండీక్యాప్ అని చెబుతూ, తన ఒక కాలు లేదని చూపించడంతో జడ్జెస్ అబ్బురపడ్డారు. ఇలా ప్రతి కంటెస్టెంట్ తన టాలెంట్, స్టైల్, యాటిట్యూడ్‌తో రాణించేందుకు ట్రై చేస్తున్నాడు. అయితే ఈ ప్రోమోలో ప్రత్యేకంగా ఆకర్షించిన అంశం, యంగ్ హీరో తేజ సజ్జ ప్రత్యక్షమవడమే. ఆయన ఎంట్రీ ఈ ప్రోమోకు మరో హైప్ తీసుకువచ్చింది. ఆగస్టు 22 నుంచి ప్రసారం కానున్న ఈ అగ్నిపరీక్ష ఎపిసోడ్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.