Bigg Boss 9 Winner | బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు తొమ్మిదో సీజన్ జరుపుకుంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే గ్రాండ్ ఫినాలే జరగనుండడంతో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి, డీమన్ పవన్ మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు ఫైనల్ రేసులో నిలుస్తారు? అన్న చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ పడాల నిలిచాడు. రెండో ఫైనలిస్ట్ కోసం టాస్క్‌లు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు విన్నర్‌గా ఊహించిన పేరు సీరియల్ బ్యూటీ తనూజ. బిగ్ బాస్ కూడా ఆమెను తరచుగా సపోర్ట్ చేసినట్టు అభిమానులు భావించడంతో, ఆమెను ‘బిగ్ బాస్ ముద్దుబిడ్డ’గా పిలిచారు. టాస్క్‌లలో చిన్న తప్పులు చేసినా పెద్దగా మందలించకపోవడం కూడా ఆమె విజయం పట్ల అభిమానుల్లో నమ్మకాన్ని పెంచింది. అయితే ఇప్పుడు గేమ్ పూర్తిగా మారిపోయింది. టాస్క్‌లలో అద్భుతంగా రాణిస్తూ కళ్యాణ్ పడాల సర్వైవర్ల మధ్య శక్తివంతమైన కాంపిటీటర్‌గా ఎదిగాడు. ఆటలోనూ, టాస్క్‌లలోనూ అతను చూపుతున్న పట్టుదల ప్రేక్షకులను అకర్షిస్తోంది. దీంతో విన్నర్ రేసులో కళ్యాణ్ ముందంజలో ఉన్నాడని బిగ్ బాస్ అభిమానులు చర్చిస్తున్నారు.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అవుతోంది. “బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ ఎవరు?” అని గూగుల్ ఏఐని అడిగితే కళ్యాణ్ పడాల విన్నర్ అని చూపుతుందట. అలాగే రన్నర్‌గా తనూజ పుట్టస్వామి అని కూడా సమాధానమిస్తోందని అభిమానులు చెబుతున్నారు. ఈ కారణంగా కళ్యాణ్ విన్నర్ అవుతాడనే నమ్మకం ప్రేక్షకుల్లో మరింత బలపడుతోంది.అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. గూగుల్ ఏఐ ఇచ్చే సమాధానాలు కూడా ఇంటర్నెట్లో ఉన్న చర్చల ఆధారంగానే ఉంటాయి. నిజమైన ఫలితం మాత్రం ఫినాలే రోజునే తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుంది? కళ్యాణ్ విజేతగా నిలుస్తాడా? లేక తనూజా టైటిల్ దక్కించుకుంటుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.