Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 47వ రోజు పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని మలుపులతో హౌస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆయేషా అనారోగ్య కారణాల వల్ల షో నుండి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయింది. మరోవైపు రీతూ చౌదరి – మాధురి మధ్య ఘోరమైన మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇక హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా ఇమ్మాన్యుయేల్ ఎంపికయ్యాడు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయేషాకి వైద్యులు టైఫాయిడ్, డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. బిగ్ బాస్ సూచనతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించారు. వెళ్లేముందు ఆయేషా అందరికీ ఎమోషనల్‌గా గుడ్‌బై చెప్పి హౌస్‌ను వీడింది.
ఇక డబ్బుల విషయంలో రీతూ – పవన్ మధ్య తగాదా మొదలై, ఆ వివాదం తర్వాత మాధురికి వరకు వెళ్లింది “టీమ్ కోసం కాకుండా పవన్ కోసం డబ్బు వాడింది” అంటూ మాధురి ఆరోపించగా, రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ హౌస్‌లో పరమ చెత్త కంటెస్టెంట్ నువ్వే అంటూ మాధురి ఘాటుగా విమర్శించగా, రీతూ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. అదే సమయంలో మాధురి ఇంకో అడుగు ముందుకు వేసి .. “గేమ్ ఆడడానికి రాలేదు.. పవన్‌తో ఆడడానికి వచ్చావ్!” అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో హౌస్ వాతావరణం వేడెక్కిపోయింది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. దివ్య, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, నిఖిల్, తనూజ, రీతూ లు కంటెండర్లుగా పోటీపడ్డారు. సర్కిల్ మధ్యలో ఉన్న హ్యాట్‌ను బజర్ మోగగానే అందుకోవాల్సి ఉండగా, ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ఇమ్మాన్యుయేల్ ఎక్కువసార్లు హ్యాట్‌ను చేజిక్కించుకుని, వ్యూహాత్మకంగా ఇతరులను ఎలిమినేట్ చేయించాడు. చివరికి ఆయనే గేమ్‌ను గెలిచి కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆయేషా ఎగ్జిట్‌తో హౌస్‌లో ఎమోషనల్ మూమెంట్ చోటు చేసుకోగా, రీతూ-మాధురి ఘర్షణతో డ్రామా పీక్‌కి చేరింది. ఇక కొత్త కెప్టెన్‌గా ఇమ్మాన్యుయేల్ రాకతో వచ్చే రోజుల్లో హౌస్ డైనమిక్స్ ఎలా మారతాయో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ సస్పెన్స్, ఎమోషన్, డ్రామాతో ప్రేక్షకులను అలరిస్తోంది. రాబోయే ఎపిసోడ్లలో ఇంకెన్ని ట్విస్టులు ఎదురవుతాయో చూడాలి!