Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం నామినేషన్ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తయింది. సాధారణంగా సోమవారం ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ పూర్తి చేస్తారు. కానీ ఈసారి నామినేషన్ ప్రక్రియ బుధవారానికి పొడిగించడంపై ఆడియన్స్ మధ్య చర్చ జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ సీజన్‌కి స్పెషల్ యాంగిల్‌గా “సెలబ్రిటీ vs కామన్ మ్యాన్” కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందులో కామన్ పార్టిసిపెంట్స్‌కి “ఓనర్స్”, సెలబ్రిటీలకు “టెనెంట్స్” అనే టైటిల్స్ ఇచ్చారు. టెనెంట్స్ ఓనర్స్‌కి పనులు చేయాలి, వంట చేసేయాలి, గృహపనుల్లో పాల్గొనాలి అనే గేమ్ ప్లాన్‌లో భాగంగా హౌస్‌లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
బుధవారం నాటికి పూర్తయిన నామినేషన్స్ ప్రకారం, టెనెంట్స్ తరఫున అంతా నామినేట్ అయ్యారు. సెలబ్రిటీలలో భరణిని మినహాయింపు చేయగా, మిగతా అందరూ ఈ వారం ఎలిమినేషన్ రిస్క్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుండి ఓనర్స్ కేటగిరీలో డిమాన్ పవన్ ఒక్కడే నామినేట్ అయ్యాడు. మొత్తంగా తొలి వారం నామినేట్ అయినవారు ఎవరనేది చూస్తే.. సంజన, రీతు చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, డిమాన్ పవన్. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఎక్కువగా సంజన గురించే చర్చిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూడు ఎపిసోడ్స్‌ను బట్టి చూస్తే, ఆమె ప్రవర్తన కొంత మంది హౌస్మేట్లలో అసహనం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా బాత్రూమ్ డ్యూటీ విషయంలో మెంటర్ కళ్యాణ్‌కు సంజన తీరుపై చిరాకు రావడం, అలాగే ఎగ్ వివాదంలో ఆమె నిర్లక్ష్యంగా స్పందించడం ఆమెపై నెగెటివిటీ వచ్చేలా చేస్తుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆడియన్స్ ఓటింగ్‌లో సంజన ఫైనల్ ప్లేస్‌లో ఉన్నట్లు సమాచారం. గతంలో బిగ్ బాస్ కన్నడ సీజన్ 1లో ఆమె రెండో వారమే ఎలిమినేట్ అయిన సంగతి గుర్తు చేస్తున్నారు అభిమానులు.ఈ సారి తొలి వారమే హౌజ్ నుండి బయటకు వస్తుందని పక్కాగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.