Bigg Boss 9 |టికెట్ టూ ఫినాలే కోసం తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్స్.. టెన్షన్ పడ్డ ఇమ్మాన్యుయేల్బిగ్ బాస్ తెలుగు 9 ఉత్కంఠభరిత దశకి చేరుకుంది. షో చివరికి చేరుకున్న నేపథ్యంలో, మొదటి ఫైనలిస్ట్‌ను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ వరుసగా కఠినమైన టాస్కులు ఇస్తున్నారు. హౌస్‌లో 87వ రోజు ప్రారంభమైన ఈ ఫైనల్ రేస్ టాస్కులు ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్రంగా మారింది. ప్రతి టాస్క్‌లో స్ట్రాటజీలు, గ్రూపింగ్లు, రివాల్ట్లు స్పష్టంగా కనిపించాయి. తాజా ఎపిసోడ్లో తొలి పోటీ సుమన్ శెట్టి, తనూజ మధ్య జరిగింది. ‘బ్యారెల్.. బ్యాలెన్స్.. బ్యాటిల్’ పేరుతో జరిగిన ఈ టాస్క్‌లో రోప్ సపోర్ట్‌తో ఇచ్చిన బ్యారెల్‌ను బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా పిలిచి, ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో ఉండకూడదని భావించిన పోటీదారుడి బ్యారెల్‌లో నీరు నింపేలా చేశారు.
సంచాలకురాలిగా సంజన వ్యవహరించింది. మొదట భరణిని పిలవగా, భరణి అందరి దృష్టిని ఆకర్షిస్తూ తనూజ బ్యారెల్లోనే ఎక్కువసార్లు నీళ్లు వదిలాడు. హౌస్‌లో భరణి–తనూజ బాండింగ్ బలమైనదే అయినా, ఈ టాస్క్‌లో భరణి తనూజను షాక్‌కి గురిచేసేలా వ్యవహరించడం విశేషం. ఇతర సభ్యులు కూడా సుమన్ శెట్టి, తనూజ బ్యారెల్ల్లో నీరు నింపినా, చివరికి బ్యారెల్ బరువు తట్టుకోలేక తనూజ వదిలేయడంతో ఆమె ఓటమి పాలయ్యింది. సుమన్ శెట్టి విజయం సాధించి తదుపరి రౌండ్‌కు చేరాడు. తదుపరి దశలో సుమన్ శెట్టి, పవన్, కళ్యాణ్ మధ్య బ్లాక్స్ టాస్క్ జరిగింది. మధ్యలో ఉన్న బ్లాక్స్‌ను సేకరించి తమ బాక్స్‌లో ఎక్కువగా ఉంచితే వారు గెలుస్తార. ప్రత్యర్థుల బ్లాక్స్‌ను కూడా లాగుకోవచ్చు. ఈ టాస్క్‌లో కళ్యాణ్ ఎక్కువగా సుమన్ శెట్టినే టార్గెట్ చేయడంతో పవన్ తన బ్లాక్స్‌ను సేఫ్‌గా కాపాడుకున్నాడు. ఇద్దరి టార్గెట్ కారణంగా సుమన్ కష్టాల్లో పడగా, చివరికి పవన్ ఎక్కువ బ్లాక్స్‌తో విజేత అయ్యాడు.
ఈ టాస్క్ తర్వాత ఇమ్మాన్యుయేల్ కామెంట్ హైలైట్ అయ్యింది. “సుమన్ ఓడిపోవడం చూసి నేను హ్యాపీ. మీరు ఇద్దరు పోటీ పడి అతనిని గెలిపించేలా చేస్తారేమోనని టెన్షన్ పడ్డా” అని కళ్యాణ్‌కి చెప్పాడు. పవన్‌ను ఓడించిన కళ్యాణ్ తదుపరి రౌండ్లో భరణితో తలపడ్డాడు. ‘వారధి కట్టు, విజయం పట్టు’ అనే ఈ టాస్క్‌లో కేటాయించిన చెక్కలతో వారధి నిర్మించి, బాక్స్‌లో ఉన్న బ్యాగ్స్‌ను వారధిపై నుంచి తీసుకొచ్చి టేబుల్‌పై వేయాలి.ఈ టాస్క్‌లో అంచనాలకు విరుద్ధంగా భరణి గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కళ్యాణ్ కంటే వేగంగా వారధి పూర్తి చేసి బ్యాగ్స్‌ను టేబుల్‌పై ఉంచి విజయం సాధించాడు. పవన్‌పై విజయం సాధించిన కళ్యాణ్‌ను ఓడించడం హౌస్‌లో చర్చనీయాంశంగా మారింది.