Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో 14వ వారం టాస్క్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతి సీజన్‌తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ అద్భుతమైన ట్విస్ట్‌లు, టర్న్‌లు ఇచ్చి ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్నారు. ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు వరుస టాస్క్‌లు ఇచ్చిన బిగ్ బాస్, ప్రతి టాస్క్‌లో ముందంజలో ఉన్న వారికి టెన్షన్ వాతావరణాన్ని పెంచాడు. మంగళవారం ఇచ్చిన వీల్ బ్యారెల్ టాస్క్‌లో ఇమ్మాన్యుయెల్,డీమాన్ పవన్‌లు అత్యధిక స్కోర్లు సాధించారు. అనంతరం టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే పరీక్షలో ఎక్కువ మంది ఓట్లు సంజనాకి పడటంతో ఆమె తదుపరి టాస్క్‌ల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. మరొకవైపు, ఇమ్మాన్యుయెల్–పవన్‌లు టాస్కుల్లో టాప్‌లో నిలవడంతో వారిని బిగ్ బాస్ నేరుగా ఆడియెన్స్ పోలింగ్‌కు పంపించాడు.
బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొంతమంది కామన్ ఆడియెన్స్‌ను హౌజ్‌లోకి పంపించి వారితో మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. ఇద్దరూ ఓట్లు కోరుకునే సమయంలో, వారి తెలివి, స్పందన, ప్రవర్తనను అంచనా వేయడానికి ఆడియెన్స్ మరియు బిగ్ బాస్ పలువురు కఠినమైన ప్రశ్నలు సంధించారు. ఇందులో ఇమ్మాన్యుయెల్ ప్రదర్శన విశేషంగా నిలిచింది. ఆడియెన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఇచ్చిన బిగ్ బాస్, ఇమ్మాన్యుయెల్‌ను ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించాడు. అప్పుడే ఒక ఆడియన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “విన్నర్ అయితే కప్‌ను మొదట ఎవరికిస్తావు? అమ్మకా, గర్ల్ ఫ్రెండ్కా?” అని అడగగా, దీనిపై ఇమ్మాన్యుయెల్ భావోద్వేగంతో స్పందిస్తూ, చిన్నప్పటి నుండి హాస్టల్స్‌లో ఉండటం వల్ల అమ్మతో గడిపిన రోజులు చాలా తక్కువని, ఆమె ఎప్పుడూ తన విజయాన్ని ఆశించిందని తెలిపాడు. అందుకే కప్‌ను ముందుగా అమ్మ చేతిలో పెడతానని చెప్పాడు.
ఈ విషయం తన గర్ల్ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటుందని, ఆమె కూడా అదే కోరుకుంటుందని ఇమ్మాన్యుయెల్ చెప్పడంతో, ఆ సమాధానం హౌజ్‌లోను, ప్రేక్షకుల్లోను మంచి ప్రశంసలు అందుకుంది. ఇది అతని స్కోర్‌ను మరింత పెంచినట్లు కనిపించింది. మరో వైపు, హౌజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, భావోద్వేగాలు ఈ వారం ఎపిసోడ్‌కు మరింత రంగులు జోడిస్తున్నాయి. ముఖ్యంగా తనూజ చేసిన కామెంట్లు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఇమ్మాన్యుయెల్ రెండో ఫైనలిస్ట్‌గా ప్రకటించే అవకాశం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫైనలిస్ట్‌గా నిలవడంతో, తర్వాత స్థానానికి ఇమ్మాన్యుయెల్ పేరు బలంగా వినిపిస్తున్నది. ఇంకా కొన్ని కీలక టాస్క్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఈసారి కమెడియన్‌ను విన్నర్‌గా చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది.