Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదో వారం హౌజ్‌లో ఎన్నో డ్రామాటిక్, ఎమోషనల్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది రాము రాథోడ్ సడెన్ సెల్ఫ్ ఎలిమినేషన్. కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఆయన, హోస్ట్ నాగార్జున, హౌజ్‌మేట్స్ ఎంతగా బ్రతిమాలినా వినకుండా ఇంటిని వీడాడు. శనివారం ఎపిసోడ్లో ప్రేక్షకులకు మరో స్పెషల్ ట్రీట్ దక్కింది. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల ‘శివ’ మూవీ రీ రిలీజ్ సందర్భంగా హౌజ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తాను మొదట హర్రర్ సినిమా చేయాలనుకున్నానని, కానీ నాగార్జున కోసం ‘శివ’ కథ రాసుకున్నానని చెప్పారు. నాగార్జున కూడా వర్మ కథ వినగానే ఈ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యానని, ‘శివ’ తన జీవితాన్ని మార్చిన చిత్రం అని తెలిపారు. అమల కూడా ఈ సినిమా తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిఉందని పేర్కొన్నారు.
ఇక ఈ వారం నాగార్జున ఆడియెన్స్ పోలింగ్ ద్వారా టాప్, బాటమ్ కంటెస్టెంట్ల లిస్ట్‌ను వెల్లడించారు.
టాప్‌లో సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, తనూజ, కళ్యాణ్, రీతూ, డీమాన్ పవన్ ఉన్నారు. బాటమ్‌లో భరణి, నిఖిల్, గౌరవ్, సంజనా నిలిచారు. సుమన్ శెట్టి నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్‌ను రిజెక్ట్ చేయగా, భరణి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైజ్కి నో చెప్పాడు. ఇమ్మాన్యుయెల్‌కు తన లవర్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ హౌజ్‌లో హైలైట్‌గా మారింది. “నువ్వు ఒంటరిగా మాట్లాడుతుంటే, నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది” అని ఆమె చెప్పడంతో హౌజ్‌లో ఎమోషనల్ మోమెంట్ నెలకొంది. ఈ జంట ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని ఇమ్మాన్యుయెల్ స్వయంగా వెల్లడించాడు. తందూరి చాయ్‌కి సంబంధించిన జ్ఞాపకాలతో నాగార్జున కూడా నవ్వులు పూయించారు.
తనూజ, రీతూ, డీమాన్ పవన్, కళ్యాణ్ మధ్య సాక్రిఫైజ్ టాస్క్‌లు ప్రేక్షకులను కదిలించాయి. తనూజ తన సిస్టర్ వాయిస్ వినే అవకాశం కోసం కళ్యాణ్ చేసిన త్యాగాన్ని రిజెక్ట్ చేసింది. రీతూ తన తండ్రి షర్ట్ తీసుకోవడంతో సంజనా తన శారీలు కోల్పోయింది. డీమాన్ పవన్ రీతూ కోసం తన ఫ్యామిలీ ఫోటోను త్యాగం చేయడంతో హౌజ్‌లో అందరు ప్రశంసించారు. ఇక చివర్లో రాము రాథోడ్ ఎమోషనల్ టర్నింగ్ పాయింట్‌గా మారాడు. ఫ్యామిలీ మిస్ అవుతున్నానని, ఒంటరిగా ఫీలవుతున్నానని నాగార్జునతో చెప్పిన ఆయన, హౌజ్‌మేట్స్ ఎంతగా ఆపిన వినలేదు. చివరికి పాట పాడి కన్నీరు పెట్టుకుని హౌజ్‌ని వీడాడు. ఆయన వెళ్లిపోవడంతో మొత్తం హౌజ్‌లో మౌనం నెలకొంది.