Bigg Boss 9 | ప్రతి ఏడాదిలా ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది బిగ్ బాస్ . ఇప్పటి వరకు 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు 9వ సీజన్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. గత 6 సీజన్లుగా హోస్ట్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కి కూడా హోస్టింగ్ చేయనున్నారు. ఈసారి కొత్త హోస్ట్ వస్తాడేమో అని అభిమానులు ఎదురు చూశారు కానీ, మళ్లీ నాగార్జునకే ఛాన్స్ దక్కింది.ఇక కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమోలు వరుసగా విడుదలవుతూ ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతున్నాయి.
ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పిస్తున్నారు. సామాన్యుల కోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహించగా, వారిలో కొందరు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నిర్ణయం షోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చేలా ఉంది. బిగ్ బాస్ హౌస్‌ను ఈసారి మరింత వైవిధ్యంగా మలచినట్లు తెలుస్తోంది. “ఇది చదరంగం కాదు, రణరంగం” అంటూ నాగార్జున ప్రోమోలో చెప్పిన మాటలు సీజన్ ఈ సారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ఉండనున్నట్టు అర్ధమవుతుంది.. అంతేకాకుండా, ఈసారి కేవలం ఒకే హౌస్ కాదు… “డబుల్ హౌస్ – డబుల్ డోస్” అంటూ మరింత ఆసక్తి రేకెత్తించే హింట్ ఇచ్చాడు. దీంతో ఈ సీజన్ మరింత గ్రాండ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండబోతోందని అంచనాలు పెరిగాయి.
సెప్టెంబర్‌లో షో మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఇక హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ వీరేనంటూ కొందరి పేర్లు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.వారిలో కల్పిక గణేష్, బుల్లితెర స్టార్స్ దీపికా, తేజస్విని, శివకుమార్, దేబ్జానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, సాయికిరణ్, సుమంత్ అశ్విన్ వంటి వారు దాదాపుగా కన్ఫమ్ అయ్యారు. వీరితోపాటు టీవీ నటి కావ్య శ్రీ పేరు వినిపిస్తుంది. అలాగే వర్మ సినిమాలోని ఓ బోల్డ్ నటి రాబోతుందని టాక్. సింగర్ సాకేత్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది.ఇక కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఈ సారి దాదాపు ఐదుగురుని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారని టాక్ నడుస్తుంది.