Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సోమవారం ప్రసారమైన 71వ ఎపిసోడ్ నామినేషన్ హీట్‌తో వేడెక్కింది. ఈసారి నామినేషన్ల ఫార్మాట్లో ట్విస్ట్ పెట్టిన బిగ్ బాస్, కెప్టెన్ తనూజ నిర్ణయం ప్రకారం కొందరు సభ్యులకు ఇద్దరిని, మరికొందరికి ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, రీతూ, భరణిలకు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లభించింది. నామినేషన్ ప్రక్రియలో ఎక్కువగా రీతూ పేరు వినిపించగా, పవన్, కళ్యాణ్, భరణి, ఇమ్మాన్యుయెల్ వంటి హౌజ్‌మేట్స్ కూడా టార్గెట్ అయ్యారు.
డీమాన్ పవన్ – రీతూ, కళ్యాణ్‌లని టార్గెట్ చేయగా, భరణి – రీతూ, ఇమ్మాన్యుయెల్, ఇమ్మాన్యుయెల్ – భరణి, రీతూ, కళ్యాణ్ – డీమాన్ పవన్, సంజనా – కళ్యాణ్, రీతూ – దివ్య, సంజనా, సుమన్ – కళ్యాణ్,దివ్య – రీతూ, భరణి – ఇమ్మాన్యుయెల్ ఘర్షణలని నామినేట్ చేశారు. నామినేషన్ల తరువాత హౌజ్‌లో ఉద్రిక్తత పెరిగింది. భరణి, ఇమ్మాన్యుయెల్ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే భరణి ఈసారి ఆగ్రహంతో ముందుకు రావడం హౌజ్‌లోని టెన్షన్ ను మరింత పెంచింది. ఇక రీతూ – పవన్ మధ్య జరిగిన వాదనలు హౌజ్ వాతావరణాన్ని మరింత హీటెక్కించాయి. భావోద్వేగాలకు లోనైన రీతూ చివరకు కన్నీళ్లు పెట్టుకుంది. పవన్, కళ్యాణ్ మధ్య కూడా ఘర్షణ చోటుచేసుకుంది. అదే సమయంలో దివ్య – రీతూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు.
కమాండర్ టాస్క్‌లో పవన్ తనూజను వెనుక నుంచి తాకిన ఘటనపై కళ్యాణ్.. పవన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తప్పు తనూజదేనని కళ్యాణ్ నేరుగా చెప్పడం హౌజ్‌లో మరో వివాదాన్ని రేపింది. తనూజ దీంతో షాక్‌కు గురైంది.మొత్తంగా చూస్తే.. ఈ వారం నామినేట్ అయిన సభ్యులు .. రీతూ, భరణి, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, దివ్య, సంజనా, డీమాన్ పవన్. కెప్టెన్ తనూజ తన పవర్‌ను ఉపయోగించి రీతూని నామినేషన్ నుంచి సేవ్ చేసింది. ఇక బిగ్ బాస్ పాటలు పాడొద్దని హెచ్చరించినా, రీతూ, దివ్య, కళ్యాణ్ పాటలు పాడటంతో కళ్యాణ్‌కు బాత్రూం క్లీనింగ్ పనిష్మెంట్ పడింది. రీతూ, దివ్య బాయ్స్‌గా మారి ఇమ్మాన్యుయెల్‌ను ఆటపట్టించడం హైలైట్. ఇద్దరూ కలిసి ‘హగ్’ కామెడీతో ఇమ్మాన్యుయెల్‌ను నలిపేసి హౌజ్‌లో నవ్వులు పూయించారు. తర్వాత కళ్యాణ్‌ను ఫన్లోకి లాగడంతో ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గా సాగింది.